కార్పొరేషన్/గంగాధర/చొప్పదండి/కొత్తపల్లి/ వీణవంక/ సైదాపూర్/ హుజూరాబాద్‌టౌన్/జమ్మికుంట/మానకొండూర్/ చిగురుమామిడి, ఫిబ్రవరి 14: జిల్లా వ్యాప్తంగా బుధవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పారమిత విద్యాసంస్థల్లో వేదపండితులతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వసంత పంచమి విశిష్టతను తెలియజేసే ప్రసంగాలు, నృత్యాలు చేశారు. విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, డైరెక్టర్లు అనూకర్‌రావు, ప్రసూన, రశ్మిత, రాకేశ్, వినోద్‌రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపాళ్లు, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అలాగే, గంగాధర ప్రభుత్వ జానియర్ కళాశాల ఆవరణలో సరస్వతీ దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రమీల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చొప్పదండిలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో చిన్నారులకు ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం నవ్యకుమార్, సింహాచలం జగన్మోహన్ అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. వీణవంకలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 22 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం జరిపించారు. పూర్వ విద్యార్థి నార్ల వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో నిర్మించిన ప్రత్యేక శిశువాటిక తరగతి గదిని ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రబంధకారిణి అధ్యక్షుడు జాజుల ప్రహ్లాదరావు, సమితి కార్యదర్శి అయిత రాంబాబు, ప్రబంధకారిణి సభ్యులు వెన్నంపల్లి నారాయణ, హెచ్ఎం మల్లేశం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల్లో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీఅమృత జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వెన్కేపల్లి, సైదాపూర్ హనుమాన్ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వెన్కేపల్లి ఎంపీటీసీ జంపాల సంతోష్, మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గల పాటిమీది ఆంజనేయస్వామి సహిత శ్రీసరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధిక, గందె శ్రీనివాస్, కౌన్సిలర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ వేణుమాధవ్, డైరెక్టర్లు, అధ్యాపకులు విద్యార్థులతో కలిసి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు జరిపించారు. విజ్ఞాన్ నెక్స్‌జెన్ స్కూల్లో చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాభ్యాసం చేయించారు. కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంటలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం సందర్భంగా వాసవీ క్లబ్ అధ్యక్షుడు లెంకలపెల్లి శరత్‌కుమార్ చిన్నారులకు స్లేట్, స్లేట్ పెన్సిల్స్, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ వితరణ చేశారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాసం నగేశ్, అదనపు ప్రధాన కార్యదర్శి లెంకలపల్లి శ్రీధర్ యాదవ్, కోశాధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆడెపు రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిగురు మామిడి మండలం ఇందుర్తిలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల లో నిర్వహించిన వేడుకల్లో కరస్పాండెంట్ కూన సంపత్, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.