ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం వసంత పంచమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే సరస్వతీ దేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని ఊరేగింపుగా పల్లకీ సేవ నిర్వహించారు.