ఈ నెల 22న మా థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్లు బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో రండి.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
ప్రముఖ నటి, దర్శకురాలు, దివంగత విజయనిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ కింగ్'. శశిధర్ చావలి దర్శకుడు. బి.ఎన్.రావు నిర్మించారు. ఈ నెల 24న విడుదలకానుంది.
శ్రీరామ్, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వంలో రామ్‌కిషన్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ను సీనియర్ నటులు సుమన్, ఆమని ఆవిష్కరించారు.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ద