మల్లేశం, స్వప్న, రోషిని రజాక్, రామస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బ్రహ్మచారి’. ఈ చిత్రాన్ని పొడిచేటి మూవీ మేకర్స్ పతాకంపై రమేష్, మాస్టర్ శ్రీకిరణ్, విగ్నేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నర్సింగ్ రావు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ…‘వయసు దాటిన తర్వాత పెళ్లి జరగడం సులువు కాదు. డబ్బున్నా ఆ పెళ్లికి ఇబ్బందులు తప్పవనే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. కొందరి జీవితాల్లో జరిగిన సందర్భాలు స్ఫూర్తిగా తీసుకున్నాం. పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు.