అహం విడిస్తే ఆనందమే
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 2న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ…‘అహాన్ని విడిచిపెట్టే ఏ బంధమైనా రంగరంగ వైభవంగా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం.
ట్రైలర్లో ఎలాంటి ఎనర్జీని చూశారో, సినిమా మొత్తం అంతే ఉత్సాహంగా సాగుతుంది. సినిమా చూసి బయటకొచ్చేప్పుడు చాలా సంతోషంగా వస్తారు’ అని చెప్పారు. నాయిక కేతిక శర్మ మాట్లాడుతూ..‘పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో రాధ పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. హీరోకు నేనంటే ఇష్టమున్నా అహం అడ్డొచ్చి దూరంగా ఉంటాడు. వీళ్ల ప్రేమను తెరపై చూడండి’ అని చెప్పింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ…‘కుటుంబమంతా కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. వైష్ణవ్ తేజ్, కేతిక జంటను మీరంతా ఇష్టపడతారు’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

