సాయిసింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. రచయిత కోన వెంకట్, దర్శకులు సముద్ర, వి.ఎన్.ఆదిత్య, నిర్మాత రామసత్యనారాయణరాజు, నటుడు, గాయకుడు కుంచె రఘు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అందరికీ తప్పక నచ్చే సినిమా ఇదని, కన్నీరు పెట్టుకోకుండా థియేటర్ల నుంచి ఎవరూ బయటకు రారని నిర్మాత, హీరో సాయి సింహాద్రి చెప్పారు. ఇంకా డిస్ట్రిబ్యూటర్ శోభారాణి, హీరోయిన్ మీరా రాజ్, రచయిత భాస్కరభట్ల, మాటల రచయిత లక్ష్మీభూపాల, డీవోపీ కిట్టు, సంగీత దర్శకుడు రిషి కూడా మాట్లాడారు.