శ్రీరామ్, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వంలో రామ్‌కిషన్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ను సీనియర్ నటులు సుమన్, ఆమని ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రేమలోని ఉన్నతమైన భావనల్ని ఆవిష్కరించే చిత్రమిది. అందుకే ‘మది’అనే టైటిల్ పెట్టాం. నేటి యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. మంచి కంటెంట్‌తో సినిమా తీశామని నిర్మాత రామ్‌కిషన్ పేర్కొన్నారు. శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: పీవీర్ రాజా, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: నాగ ధనుష్.