‘మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న నటి రిచా జోషి. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో తన ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది ఈ ముంబయి బ్యూటీ.
శ్రీరామ్, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వంలో రామ్‌కిషన్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ను సీనియర్ నటులు సుమన్, ఆమని ఆవిష్కరించారు.