బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర కథానాయికలు. శ్రీనివాస్ మహత్ దర్శకుడు. మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మాతలు. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ ‘అమ్మానాన్నల సపోర్ట్ వల్లే నేనిక్కడున్నా. మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతా. ‘రామ్‌నగర్ బన్నీ’గా మీ ముందుకు తొలిసారి రాబోతున్నా. ఇది అందరికీ కనెక్టయ్యే సినిమా. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం. ఈ సినిమా వసూళ్లలో పదిశాతం వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ర్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపాడు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.