– రచయిత రంగనాథ్‌కు కేసీఆర్ అభినందనలు
ఇల్లెందు, మార్చి12 : టీబీజీకేఎస్ నాయకుడు, ప్రముఖ రచయిత ఎస్.రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు కథల సంపుటిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కేసీఆర్‌కు అంకితం ఇవ్వగా నిన్న ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ కేసీఆర్‌కు అందజేశారు. పుస్తకాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను కేసీఆర్ అభినందిస్తూ తెలుగు సాహిత్య వికాసానికి ఇలాంటి ప్రయత్నాలు కొనసాగాలని ఆకాక్షించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో రచయితలు, కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మేధావులు గొంతు విప్పాలని పేర్కొన్నారు.