Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో పోషిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఎస్ థమన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ రన్‌టైంపై అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ రన్‌టైం 2 గంటల 33 నిమిషాల 59 సెకన్లు. ఇందులో పస్ట్ హాఫ్ రన్ టైం గంట 11 నిమిషాల 30 సెకన్లు కాగా.. సెకండాఫ్ రన్‌టైం గంట 22 నిమిషాల 29సెకన్లు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ లాంటి పవర్ ఫుల్ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అవుతుంది.. అంటూ ఇక సీట్లకు అతుక్కపోవాల్సిందేనని మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు.
ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న స్టిల్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిసిందే. పవన్ కల్యాణ్‌తోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Total Runtime: 2hr 33Min 59sec
First half: 1hr 11min 30sec
Second half: 1hr 22min 29secCarrying promising vibes, loading another blockbuster from the POWERful duo #PawanKalyan & #HarishShankar pic.twitter.com/VOl5YjcYbb
— BA Raju’s Team (@baraju_SuperHit) March 12, 2026
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్‌కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్‌తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్‌డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!