జీవన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మన్యం రాజు’. వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై విజయ్ బాబు, వై. ప్రవీణ్, బి.పుష్పలత నిర్మిస్తున్నారు. సోమసుందరం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘సరికొత్త కథా నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము’ అన్నారు. దర్శకుడు సోమసుందరం మాట్లాడుతూ…‘ఈ చిత్రానికి కష్టపడి పనిచేశాం. చిన్న చిత్రమైనా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. సుమన్, జీవన్, భీమాస్ అశోక్, బేబీ పరిణిక తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఫ్లాంక్లిన్ సుకుమార్.