రాహుల్‌గాంధీని ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. రాహుల్‌ను ఆది శంకరాచార్యతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన రెండో వ్యక్తి రాహుల్ అని కొనియాడారు.
సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వలసలు వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
పెరూలో జాతీయ సమ్మె ఆందోళనరూపం దాల్చింది. మాజీ అధ్యక్షుడు పెడ్రో మద్దతుదారులు శాన్ మార్టిన్ ప్లాజా వద్ద గుమిగూడారు. ఇదే సమయంలో భవనంలో మంటలు చెలరేగాయి.
ప్రధాని మోదీ ఓ ర్యాలీలో పాల్గొనడానికి ముందు నకిలీ సైనికుడొకరిని గుర్తించారు. గార్డ్స్ రెజిమెంట్ నాయక్ అని చెప్పిన రామేశ్వర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులు విచారిస్తున్నారు.
తిరుమలలో నో ఫ్లైజోన్‌గా ఉన్న కొన్ని దృశ్యాలు బయట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను కొందరు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.