Garikapati Narasimha Rao | ‘ఇడుపు కాయితం’ వివాదం.. తెలంగాణ భాషకు మద్దతుగా గరికపాటి వ్యాఖ్యలు..
Garikapati Narasimha Rao | ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో టైటిల్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Garikapati Narasimha Rao | ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో టైటిల్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు నెటిజన్లు ఈ పేరును అర్థం చేసుకోలేక విమర్శలు చేయగా, మరికొందరు దీనిని తెలంగాణ భాషా ప్రత్యేకతగా అభివర్ణిస్తూ మద్దతు తెలుపుతున్నారు. సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు కనిపించాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు ‘ఇదేం భాష?’, ‘ఇది అసలు తెలుగేనా?’, ‘సబ్‌టైటిల్స్ వేయాలా?’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ కామెంట్లు క్రమంగా భాషా చర్చగా మారి, ఆంధ్ర-తెలంగాణ మాండలికాల మధ్య వాదోపవాదాలకు దారితీశాయి.
దీనిపై తెలంగాణకు చెందిన భాషాభిమానులు, రచయితలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మాండలికాన్ని కించపరచడం సరికాదని, ప్రతి ప్రాంత భాష కూడా తెలుగు భాష సంపదలో భాగమేనని వారు పేర్కొన్నారు. ఈ వివాదం మధ్య ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గతంలో తెలంగాణ భాష గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాష గ్రాంథిక తెలుగుకు అత్యంత దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వాడే అనేక పదాలు శాస్త్రీయమైనవి. ‘చేసిన్రు’ వంటి పదాలకు గ్రాంథిక భాషలో కూడా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ మాండలికం వ్యాకరణపరంగా ఎంతో బలమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆంగ్ల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతంలో పాత తెలుగు పదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెలంగాణ భాషకు మద్దతు తెలుపుతున్నారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా ఉపయోగంలో ఉన్న ఒక సంప్రదాయ పదమే ‘ఇడుపు కాయితం’. పూర్వం భార్యాభర్తలు కలిసి జీవించలేమని నిర్ణయించుకున్నప్పుడు కోర్టుల చుట్టూ తిరగకుండా, గ్రామ పెద్దల సమక్షంలో విడిపోవడానికి రాసుకునే ఒప్పంద పత్రాన్ని ‘ఇడుపు కాయితం’ అని పిలిచేవారని భాషా పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, తెలంగాణ గ్రామీణ జీవన విధానం, సామాజిక వ్యవస్థకు సంబంధించిన ఒక చారిత్రక పదంగా భావిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, భాషా ప్రేమికులు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు అనేక మాండలికాలు ఉన్నాయని, వాటిని అవమానించడం కంటే వాటి ప్రత్యేకతను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘కాంతార’, ‘కరుప్పు’ వంటి ఇతర భాషా చిత్రాల పేర్లను ప్రేక్షకులు స్వీకరించినట్లే, మన సొంత భాషలోని ప్రాంతీయ పదాలను కూడా గౌరవించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#IdupuKayitham
ఇడపు కాయితం పై చర్చ అనవసరం….వాళ్లకు ఓ యాస, సంస్కృతి ఉంటే పక్క వాళ్లకు కూడా ఓ యాస, సంస్కృతి ఉంటాయి. అందరినీ గౌరవించాలి. వారి యాస, సంస్కృతిని గౌరవించాలి.#IdupuKayithamMovie #Priyadarshi #NagaDurga #BunnyVas #Telangana pic.twitter.com/h4DMXIz6im
— D. MOHAN BABU (@TheMohan555) June 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

