తెలంగాణకు కాంగ్రెస్ అంతులేని ద్రోహం
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘అభయ హస్తం’లో పేరొన్న 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
- అబద్ధాలను మించిన ‘అభయహస్తం’
- తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిది
- హామీలన్నీ బూటకం..అన్నివర్గాలకు తీవ్ర మోసం
- 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలపై
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి
- బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ హామీ ఏడబోయింది?
- మూడేండ్లలో ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లలోపే
- ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం కాంట్రాక్టులు, బీసీలకు
- 42 శాతం వాటా హామీలు అమలుకు నోచుకోలేదు
- విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఏదీ?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘అభయ హస్తం’లో పేరొన్న 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా సమాధానం చెప్పాలని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. వీటన్నింటికీ మించి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అభయహస్తం’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వివిధ వర్గాలకు భారీ హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని విమర్శించారు.
బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, యువత, విద్యార్థులు, మైనారిటీలకు ఇచ్చిన హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని పేరొన్నారు. బీసీ డిక్లరేషన్‌లో భాగంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో బీసీల కోసం కేటాయించిన నిధులు రూ.5 వేల కోట్లలోపే ఉన్నాయని విమర్శించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తామని ప్రకటించినా అమల్లో మాత్రం సున్నా పురోగతి ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలూ బుట్టదాఖలు
పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించేలా ‘అంబేదర్ అభయ హస్తం’ పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్‌లో భాగంగా అధికారంలోకి వచ్చిన 365 రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా అమల్లో విఫలమైందని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీకి బదులుగా కేవలం 10 వేల ఉద్యోగాలే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యా భరోసా కార్డు ఏది?
విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల విలువైన ‘విద్యా భరోసా కార్డు’ అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆచరణలో మాత్రం వారిని నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమం కోసం ఏటా రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిందని పేరొన్నారు. కానీ, కేటాయింపులు రూ.వెయ్యి కోట్లలోపే ఉన్నాయని వివరించారు.
కాంగ్రెస్ ద్రోహానికి అంతులేదు
బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఆర్థిక పథకం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, మైనారిటీలకు భారీ బడ్జెట్.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని కేటీఆర్ పేరొన్నారు. వాటిలో కీలకమైన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా యువత, బడుగు బలహీన వర్గాలను వంచించిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

