మౌళిక వసతులు, సాగునీటి కల్పనతో గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు:మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వలసలు వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి మండలం చిమనగుంట పల్లిలో పల్లెనిద్రలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనపర్తి క్యాంపు కార్యాలయంలో 70 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.20.64 లక్షల విలువైన చెక్కులను అందజేసి వారితో సహపంక్తి భోజనం చేశారు.
నల్లచెరువుపై రూ.కోటి 15 లక్షలతో, వశ్యా తండాలో రూ.84 లక్షలతో నిర్మించే సీసీ రహదారులు, మెట్ పల్లిలో రూ.45 లక్షలతో నిర్మించే సీసీ డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాజనగరం అమ్మచెరువు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మౌళిక వసతులు, సదుపాయాలు పెరిగాయని అన్నారు.
పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో సౌకర్యాలు మెరుగయ్యాయని వివరించారు.మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చెరువులు, కుంటల మరమ్మతులతో సాగునీటి వసతులు, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.వనపర్తి చుట్టూ ఉన్న చెరువుల పునరుద్దరణతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు పట్టణంలో బోరుబావులు రీఛార్జ్ అయ్యాయని వెల్లడించారు.
రహదారుల విస్తరణ పూర్తయితే వనపర్తి మోడల్ పట్టణంగా నిలుస్తుందని పేర్నొన్నారు. అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి నెలా 47 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

