RTC Bus Accident | వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సు బోల్తా కొట్టి రోడ్డుకు అడ్డంగా పడటంతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కాగా, ప్రమాదం గురించి స్థానికులు అందించిన సమాచారం వేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పెబ్బేరు ఆస్పత్రితో పాటు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.