Keerthy Suresh | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండటంపై కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ మహిళా ఇన్స్టాగ్రామ్ యూజర్ కీర్తి సురేష్‌ను విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేసింది. కెరీర్లో సరైన పాత్రలు రాకపోవడం వల్లే కీర్తి ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్ చేస్తోందని, అంతేకాకుండా ఇది తెలుగు చిత్రం కాకుండా కన్నడ సినిమా అంటూ తప్పుగా మాట్లాడింది. ఆ వీడియోపై స్పందించిన కీర్తి సురేష్ ఎలాంటి సీరియస్ కామెంట్స్ చేయకుండా తనదైన శైలిలో ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. “వేరా లెవెల్ పోస్ట్ ఇది! కానీ చిన్న కరెక్షన్. నాని నటిస్తోంది తెలుగు సినిమా, కన్నడ కాదు” అంటూ తమిళంలో సరదాగా రిప్లై ఇచ్చి ట్రోలర్స్‌కు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.