John Wesley | కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని నిధుల కేటాయింపు సరిగా జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పునర్ సమీక్షించాలని.. లేని పక్షంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగడంతోపాటు కార్మికులకు అందాల్సిన నిధులను మదింపు చేశారని అలాగే సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు. ప్రాజెక్టులు ఫ్యాక్టరీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్య వైద్యానికి సరైన నిధులు కేటాయించకపోవడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను తగ్గించారని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రకటించే బడ్జెట్లో 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మండ్లు కేటాయిస్తామని సంవత్సరమైన కేటాయించలేదని ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. అలాగే యూనివర్సిటీల అభివృద్ధికి ఐదువేల కోట్లు కేటాయించడంతోపాటు సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలన్నారు. స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ తిరుగులేని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, నెమ్మాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు