The Paradise Villain | కిల్ సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించాడు రాఘవ్ జుయల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న ది ప్యారడైస్లో విలన్‌గా కనిపించబోతున్నాడని తెలిసిందే. అయితే ఈ మూవీ కంటే ముందు రాఘవ్ జుయల్ హిందీ ప్రాజెక్ట్ ‘భాయ్ తేరా స్టార్ హై’ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్క్యూలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వివేక్ అగర్వాల్ ఆసక్తికర విషయం ఒకటి షేర్ చేసుకున్నారు. రాఘవ్ జుయల్ హీరోగా నటించిన భాయ్ తేరా స్టార్ హై సినిమాను కేవలం నెలలోపై షూట్ చేశారట. సినిమా మొదలవ్వగానే విస్త్రృతమైన వర్క్‌షాప్‌లను నిర్వహించామని.. ప్రతీ ఒక్క యాక్టర్ తమ లైన్స్‌ను ముందస్తుగానే నేర్చుకుని ప్రిపేర్ అవడం వల్లే సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసే అవకాశం దొరికిందని అన్నాడు.
తాను ఓ పెద్ద సూపర్‌స్టార్ అవుతానని భ్రమల్లో బతికే ఒక యాక్టర్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతోంది ‘భాయ్ తేరా స్టార్ హై’. కానీ అతడు మాత్రం ఓ బ్యాడ్ నటుడిగా ఉండిపోతాడు. సంజయ్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే వారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ది ప్యారడైస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం.. అది కూడా నానితో ఫైట్ చేయబోతుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.