IND vs ZIM | అర్ధశతకాలతో కదంతొక్కిన ఇషాన్, తిలక్.. భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించేనా..!
IND vs ZIM : టాపార్డర్ విఫలమైనా మేమున్నామంటూ ఇషాన్ కిషన్(81), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(60 నాటౌట్)లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు.
IND vs ZIM : పొట్టి సిరీస్ రెండో మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. టాపార్డర్ విఫలమైనా మేమున్నామంటూ ఇషాన్ కిషన్(81), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(60 నాటౌట్)లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. 95 వద్ద మూడో వికెట్ పడినా ఒత్తిడికి లోనవ్వని ఇషాన్, తిలక్ అర్ధ శతకాలతో కదంతొక్కి భారీస్కోర్‌కు బాటలు వేశారు. వీరిద్దరి విధ్వసంతో టీమిండియా ప్రత్యర్థికి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్లో టాస్ ఓడిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(8) ఈసారి కూడా నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన అతడిని ముజరబని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(20) జింబాబ్వే బౌలర్లను భయపెట్టాడు. కానీ, అదే ఊపులో ఆడబోయి అతడు వికెట్ సమర్పించుకున్నాడు. 29 కే రెండు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(25), ఇషాన్ కిషన్(81)లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును ఉరికించారు.
Innings Break!
Solid fifties from Ishan Kishan and Tilak Varma propel #TeamIndia to a strong total 🎯
Over to our bowlers to defend this 🙌
Scorecard ▶️ https://t.co/Z8UUziVx8d#ZIMvIND pic.twitter.com/1LM7Yv4qyF
— BCCI (@BCCI) July 25, 2026
అయితే.. బెన్నెట్ ఓవర్లో అయ్యర్ ఔటవ్వడంతో 95 వద్ద మూడో వికెట్ పడింది. అనంతరం ఇషాన్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(60 నాటౌట్)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ధనాధన్ ఆడిన ఈ ద్వయం జింబాబ్వే బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొంది.
ఈ ఫార్మాట్లో 12వ అర్ధ శతకం తర్వాత ఇషాన్ ఔటైనా.. తిలక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకోగా రింకూ సింగ్(12) విఫలమయ్యాడు. ఇషాన్, తిలక్ విధ్వంసంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. . జింబాబ్వే బౌలర్లలో ముజరబని, నగవరా, ఎవాన్స్, న్యూమన్, బెన్నెట్లు తలా ఒక వికెట్ తీశారు.
FIFTY in just 2⃣3⃣ deliveries 🔥
A knock full of intent from vice-captain Tilak Varma 🫡
Updates ▶️ https://t.co/Z8UUziVx8d#TeamIndia | #ZIMvIND | @TilakV9 pic.twitter.com/FqNKtur3vM
— BCCI (@BCCI) July 25, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

