హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కేవలం రాజకీయ నాయకుడే కాకుండా మానవతావాది ( Humanitarian ) గా నిరూపించు కుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy ) అన్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన దాడిని నిరసిస్తూ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని ఆందోళనకారులకు సంఘీభావంగా పోరాటంలో పాల్గొన్న నాయకుడని ప్రశంసించారు.
కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో రెండు డాక్యుమెంటరీలు ,ఒక పాట విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూలిపోయిందని ఆరోపించారు. దేశ నిర్మాణానికి యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ అనుకూల వాదీ రాహుల్ గాంధీ అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీట్ పరీక్ష పేపర్ లీక్ పై కనీసం హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేయలేదని ఆరోపించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యుల తీరుతో బీజేపీ పని ఒడిసిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వాల పనితీరుపై జెన్ జీ మొత్తం గమనిస్తూనే ఉందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఎన్ని శాపనార్థాలు పెట్టిన ఆయుష్షు పెరుగుతుందే తప్ప తరగదని స్పష్టం చేశారు.