కట్టంగూర్, జూలై 25 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన వారాహి నవరాత్రి మహోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధల మధ్య పరిసమాప్తి అయ్యాయి. ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలు, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి, వార్షిక ఏకాదశి హోమం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి సహస్ర పుష్పార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.
అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన సేవ నిర్వహించగా భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి రమేష్, రామడుగు శశిరేఖ, వార్డు సభ్యులు శ్రీరామ వీరేశం సంధ్య, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ, కడవేరు మల్లికార్జున్ కృష్ణవేణి, రాపోలు వెంకటేశ్వర్లు లక్ష్మి, రెడ్డిపల్లి సైదులు సైదమ్మ, చెవుగోని సైదులు లక్ష్మి, కొంపెల్లి సైదులు సుజాత, బండారు అరుణ్ జ్యోతి, ఇల్లందుల రామ్మూర్తి సంధ్య, చిక్కు బుచ్చిబాబు పద్మ దంపతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కోమటి భాస్కర్, కాపు గంటి గోపి, కొల్లూరు శివప్రసాద్, కాపు గంటి నరేష్, గుండు రూప, గుడిపాటి పద్మ, కొత్త శోభ, గణేష్ పాల్గొన్నారు.