బుధవారం 20 జనవరి 2021
Suryapet - Dec 03, 2020 , 02:42:12

నోముల నర్సింహయ్యకు అశ్రునివాళి

నోముల నర్సింహయ్యకు అశ్రునివాళి

కోదాడటౌన్‌/మేళ్లచెర్వు/హుజూర్‌నగర్‌ రూరల్‌: ప్రజాసేవ కోసం పరితపించిన నేత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అని పట్టణ యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, పేదలకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  నర్సింహయ్యకు నివాళులర్పించారు. నోముల మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలుగాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు ప్రార్థించారు. నర్సింహయ్య మృతి బాధాకరమని టీఆర్‌ఎస్‌ మేళ్లచెర్వు మండలాధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య పేర్కొన్నారు.  నోముల తన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పనిచేశారని హుజూర్‌నగర్‌ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నోముల చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కట్టెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, ఈదుల కృష్ణయ్య, గుండెల సూర్యనారాయణ,  దేవబత్తిని నాగార్జున్‌రావు,  సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణమూర్తి, మేకల వెంకట్రావ్‌, ఉయ్యాల నర్సయ్య, ఇమాం,  చావా వీరభద్రారావు,  అబ్దుల్‌ నబీ, అంజిరెడ్డి, నరేశ్‌, నారపరెడ్డి, రాజేశ్‌, ఓంకార్‌ పాల్గొన్నారు. logo