దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో టీకాల డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో టీకాల డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 19,84,43,550 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 సంవత్సరాల వయస్సున్న 12,52,320 మంది లబ్ధిదారులకు సోమవారం మొదటి డోసు అందజేసినట్లు చెప్పింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,18,81,337 మందికి మొదటి మోతాదులు అందజేసినట్లు చెప్పింది. బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 18-44 సంవత్సరాల వయస్సున్న వారికి 10లక్షలకుపైగా డోసులు వేశాయని వివరించింది. టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 129వ రోజు చేరగా.. ఒకే రోజు 23,65,395 వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 21,90,849 మందికి మొదటి మోతాదు, 1,74,546 మంది రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

