సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. ఏడుగురు గల్లంతు
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు | సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు.

అమరావతి : సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన మల్కాన్‌గిరి జిల్లా కెందుడుగ వద్ద సోమవారం అర్ధరాతి చోటు చేసుకున్నది. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్లేందుకు నాటుపడవలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటుపడవల్లో 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అందరు వలస కూలీలుగా సమాచారం. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూలీలు స్వగ్రామాలకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. ముందుగా వెళ్తున్న నాటుపడవ.. అదుపు తప్పి నీట మునిగిందని.. ఆ తర్వాత వెనుకాలే వస్తున్న మరో నాటుపడవ దాన్ని ఢీకొట్టడంతో మునిగిపోయిందని ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఒకరు తెలిపారు. గిరిజన కూలీలు హైదరాబాద్ నుంచి ఒడిశాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం వరకు సీలేరుకు చేరుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైనా వెళ్లకుండా అడ్డుకుంటారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో రెండునాటుపడవల్లో బయలుదేరారు. ఈ క్రమంలోనే రెండు పడవలు నీటమునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

