దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. నిన్న 4వేలకుపైగా మరణాలు నమోదవగా.. కొత్తగా నాలుగువేలకు దిగువన రికార్డయ్యాయి. మరో వైపు పెద్ద సంఖ్యలో బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 3,511 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. 24 గంటల్లో 3,26,850 బాధితులు డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కు పెరగ్గా.. 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మరో వైపు టీకా డ్రైవ్‌లో భాగంగా 19,85,38,999 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20,58,112 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 33,25,94,176 టెస్టులు చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

