శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Nov 12, 2020 , 02:46:34

మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురాలి

  •   నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
  •   కాంగ్రెస్‌ నుంచి 700 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక  

 కట్టంగూర్‌ (నకిరేకల్‌) : నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా పార్టీ కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు గుర్రం గణేశ్‌, పూర్ణచందర్‌రెడ్డి, కందాళ భద్రారెడ్డి, ఏర్పుల లింగయ్య, దేశపాక సైదులు, చిలుకూరి జనార్దన్‌, ధర్మయ్య, జెల్లా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 700 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. నకిరేకల్‌ పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ. 4కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.20కోట్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొండేటి సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకన్న, ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, దాసరి సంజయ్‌, బండమీద శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.