e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Mystery | ఈ ఊళ్లో ఒక‌రు పోతే.. వారంలో ఇంకొక‌రు చావాల్సిందే.. వంద‌ల ఏళ్లుగా ఇదే సీన్‌

Mystery | ఈ ఊళ్లో ఒక‌రు పోతే.. వారంలో ఇంకొక‌రు చావాల్సిందే.. వంద‌ల ఏళ్లుగా ఇదే సీన్‌

Mystery | ‘వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌’ అంటే ఎగిరి గంతేస్తాం! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడితే మురిసిపోతాం. కవల పిల్లలు పుడితే సంబురం చేసుకుంటాం. కానీ, చావు వెనుక చావు అయితే? ఆ గ్రామ పరిస్థితి ఇదే! ప్రతి మరణం తర్వాతా ఇంకో మరణం ఉంటుంది. ఒక ఇంట్లో పీనుగ లేచిదంటే, ఇంకో ఇంట్లో పాడె సిద్ధం చేయాల్సిందే! ‘పోయాక మన వెనుక ఎవరూ రారు’ అన్న మాట నెన్నెల గ్రామానికి వర్తించదు. ఎవరో ఒకరు వచ్చితీరుతారు. ఆ ఒకరు ఎవరైనా కావచ్చు. ఈ విస్తుపోయే ఘటనలు జరిగేది ఎందుకు? ఎలా?

మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామం, మహాభారతంలోని పాండవుల అరణ్యవాసాన్ని తలపిస్తుంది. నాడు ఒక రాక్షసునికి ఆహారంగా రోజుకొక్కరు వెళ్లేవారట. ‘రేపు ఎవరి వంతు?’ అన్న భయం కంటినిండా నిద్రను కూడా దూరం చేసేదట. ఇప్పటికీ నెన్నెలలో అదే భయం, అలాంటి పరిస్థితే. అయితే ఇక్కడ అలాంటి బకాసురుడు లేడు. విధి ఆడుతున్న వింత నాటకమిది. అనాదిగా అంతుపట్టని జంటచావుల కథ ఇది.

మొదటి నుంచీ..

- Advertisement -

నెన్నెల గ్రామానికి ఐదువందల యేండ్ల చరిత్ర ఉన్నది. నానియల్‌ అనే ఉర్దూపదం నుంచి ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడే కాదు, శతాబ్దాలనుంచీ కూడా ఊర్లో ఎవరైనా చనిపోతే తోడుగా ఇంకొకరు పోతున్నారట. చనిపోయిన వ్యక్తి దినాలు కాకముందే, మరొకరు చనిపోవడం వెనుక రహస్యం అంతు పట్టకుండా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. తొలుత ఇదొక మూఢనమ్మకం అనుకున్నారు. అపోహ అని భావించారు. కానీ, వరుస సంఘటనలు కొనసాగుతుండటంతో… గణాంకాలతో సహా సాక్ష్యాలూ ఆధారాలూ ఉండటంతో హేతువాదులు సైతం వాదనకు సాహసించడం లేదు.

తర్వాత ఎవరు?

తాత ముత్తాతల నుంచీ ‘జంట చావుల’ ఆనవాయితీ ఉందిక్కడ. గ్రహశాంతులు చేశారు. బలులు ఇచ్చారు. వాస్తు నిపుణులను సంప్రదించారు. వేద పండితుల సలహాలు అడిగారు. చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ, చావులు మాత్రం ఆగడం లేదు. ఒక ఇంట్లో చావు, ఊరందరికీ మృత్యుభయాన్ని కలిగిస్తున్నది. ‘ఫలానా వ్యక్తి చనిపోయాడు. అతడికి తోడుగా ఇప్పుడు ఇంకెవడు పోతాడో. ఆ జాబితాలో నువ్వున్నావా? నేనున్నానా?’ అని భయభ్రాంతులకు గురవుతున్నారు నెన్నెల గ్రామప్రజలు. ఈ భయంతోనో ఏమో, ఒక్కోసారైతే ఇద్దరి నుంచి నలుగురి వరకూ చనిపోతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరీ దుర్భరం.

కారణం ఏమిటి?

తరాల నుంచీ జంట చావులగురించి భయపడుతూ వస్తున్నారే గానీ కారణం ఏమై ఉంటుందనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు. సైన్స్‌ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో, టెక్నాలజీ ఇంతగా విస్తరించిన సమయంలో ఇలాంటివి నమ్ముతారా? అనేవాళ్లూ ఉన్నారు. నమ్మడం, నమ్మకపోవడం అటుంచితే ఇలా ఎందుకు అవుతున్నదన్న చర్చ మాత్రం గ్రామంలో జరుగలేదు. చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితి చూస్తూ వస్తున్నవారు. ‘సచ్చినోళ్లను పడమర దిక్కు తీస్కపోయి సావు జేస్తున్నరు. ఇట్ల జేయడం వల్లనే జంట పీనుగులు లేస్తున్నయి. అట్లా కాకుండా తూర్పు దిక్కు తీస్కపోయి సావుజేస్తే జంట పీనుగుల్లేవవు’ అని అంటున్నారు. ఈ వాదనను వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు.

పక్కా లెక్కలు

గ్రామ పంచాయతీ మరణ ధ్రువీకరణ పుస్తకంలో ఏ పేజీ చూసినా.. ఒకటి నుంచి వారం వ్యవధిలో రెండు మరణాలు జరిగినట్లు లెక్కలున్నాయి. ఇవాళ ఒకరు చనిపోతే, 24 గంటల వ్యవధిలో మరొకరు మరణించక తప్పడం లేదు. మహా అంటే చనిపోయిన వ్యక్తి దినాలు అయ్యేలోపే కొత్త చావు కబురు చల్లగా వినాల్సి వస్తుంది. ఏండ్ల తరబడి రికార్డులు పరిశీలించినా ఇదే పరిస్థితి. ‘గ్రామ పంచాయితీల నేను మొదట్నుంచీ ఉన్నా. 1965 నుంచీ లెక్కలు రాస్తున్నా. వారం లోపల ముగ్గురు, నలుగురు సచ్చిపోయిన దినాలున్నయి. ఊళ్లె నెలకొక్కరు పుడితే సచ్చిపోయెటోళ్లు మాత్రం ఇద్దరుంటరు. ఇదేం చిత్రమో ఎవరికీ అర్థమైతలేదు’ అంటాడు పంచాయతీ వ్యవహారాలు చూసే పురుషోత్తం. ‘ఊళ్లె జంట పీనుగులు లేవడం బాధనిపిస్తది. ఎవ్వరు ఎప్పుడు పోతరో అని బాధైతది. మేం సావు కుండలు ఇస్తం. ఇట్లా ఇయ్యవట్టి ముప్పయేండ్లాయె. ఒక్కొక్కసారైతే నాలుగు కుండలు కూడా ఇచ్చిన. తాత ముత్తాతలు కూడా మాకు ఈ విషయం చెప్పిండ్రు. మతలబేందో ఏమో?’ అని బాధపడిపోతాడు కుమ్మరి రాజయ్య. ఎవరికి కదిలించినా చావు వార్తలే. ఇదంతా చూసి, ఆ ఊరికి పిల్లనివ్వడానికి కూడా కొంతమంది జంకుతున్నారు. జీవితాల్లో ఇంత అభద్రత మంచిది కాదు. నెన్నెలలో గూడుకట్టుకున్న అనిశ్చితిని ఎవరో ఒకరు తొలగించాలి.

మస్తు మంది సచ్చిపోయిండ్రు

జంట పీనుగుల్లేవడం మస్తు చూసిన. ఒకదానితోటి ఇంకోదానికి సంబంధమే ఉండదు. చానా చిత్రమనిపిస్తది. ఇట్లా జరగొద్దని పాడెలకు కోడిపిల్లలను కట్టి తీస్కపోతం. అయినా కూడా
జరిగేది జరుగుతనే ఉంది. – రాంబాయ్‌

-సుంకరి నారాయణ నెన్నెల, మంచిర్యాల జిల్లా

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

క‌రీంన‌గ‌ర్‌లోని ఈ గుట్ట‌ల‌ వల్లే తెలుగు భాష‌కు ప్రాచీన హోదా వచ్చిందా?

ఆ 2 ద్వీపాల మ‌ధ్య దూరం 4 కిలోమీట‌ర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement