e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

Honeymoon best places | ఏక‌కాలంలో రెండు దేశాల్లో హ‌నీమూన్ జ‌రుపుకోవాల‌ని అనుకుంటున్నారా? ఒకే బెడ్‌పై ఉండి ఒక‌ దేశం నుంచి మ‌రో దేశానికి మారిపోవాల‌ని అనుకుంటున్నారా? రెండు వేర్వేరు దేశాల్లో తొలిరాత్రిని జ‌రుపుకున్న మ‌ధురానుభూతిని పొందాల‌ని కోరుకుంటున్నారా? ఇంకెందుకు ఆల‌స్యం ! మీ జీవిత భాగ‌స్వామితో క‌లిసి స్విట్ల‌ర్లాండ్‌కు టికెట్ బుక్ చేసేసుకోండి. ఒకేసారి రెండు దేశాల్లో ఉంటూ ఫ‌స్ట్ నైట్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తామ‌ని అంటోంది స్విట్జ‌ర్లాండ్‌లోని హోట‌ల్ అర్బెజ్‌.

అర్బెజ్ హోట‌ల్ స్పెషాలిటీ ఇది..

ఒక‌ప్పుడు వాల్లీ డెస్ డ‌ప్పెస్ అనే ప్రాంతం స్విట్జ‌ర్లాండ్ ఆధీనంలో ఉండేది. కానీ ఆ ప్రాంతాన్ని త‌మ దేశంలో క‌లుపునేందుకు ఫ్రాన్స్ చాలాసార్లు ప్ర‌య‌త్నించింది. చివ‌రి ప్ర‌య‌త్నంగా 1862లో స్విట్జ‌ర్లాండ్ ముందు ఒక ఒప్పందాన్ని ఉంచింది. త‌మ‌కు ఆ ప్రాంతం అప్ప‌గిస్తే అంతే విస్తీర్ణం ఉన్న మ‌రో ప్రాంతాన్ని అప్ప‌గిస్తామ‌ని ఫ్రాన్స్ పేర్కొంది. ఇందుకు స్విట్జ‌ర్లాండ్ అంగీక‌రించ‌డంతో లా క్యూర్ గ్రామంలోని కొంత భూభాగాన్ని ఫ్రాన్స్‌కు ఇచ్చేసింది. దీంతో లా క్యూర్ గ్రామం రెండుగా చీలింది. కొంత‌మంది ప్ర‌జ‌లు ఫ్రాన్స్‌లోనే ఉండిపోగా.. మ‌రికొంత‌మంది మాత్రం స్విట్జ‌ర్లాండ్ పౌరులుగా మారిపోయారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. కొత్త‌గా ఏర్పాట‌య్యే స‌రిహ‌ద్దు మ‌ధ్య‌లో ఉన్న భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌ను విభ‌జించ‌డానికి లేదా కూల్చివేయ‌డానికి వీలులేదు. అయితే ఈ నిబంధ‌న‌ను ఆస‌రాగా చేసుకున్న ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపార‌వేత్త పొంతుస్‌ ఒక ప్లాన్ వేశాడు.

- Advertisement -

రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య‌లో ఒక బిల్డింగ్ ఉంటే అంద‌ర్నీ ఆక‌ర్షిస్తుంద‌ని పొంతుస్‌ అనుకున్నాడు. దీంతో ప్ర‌భుత్వం స‌రిహ‌ద్దులు మార్చ‌డానికి ముందే శ‌ర‌వేగంగా మూడంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించేశాడు. ఆ త‌ర్వాత ఈ బిల్డింగ్‌కు ఒక‌వైపు గ్రాస‌రీ షాపు, మ‌రో వైపు బార్‌ను ప్రారంభించాడు. ఇక రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో ఇది శ‌ర‌ణార్థుల‌కు, ఫ్రాన్స్ సైనికుల‌కు ఆశ్ర‌యంగా మారింది. ఆ త‌ర‌వాత 1921 నాటికి పొంతుస్ వార‌సులు ఈ భ‌వ‌నాన్ని జులెస్ జీన్స్ ఆర్బెజ్ అనే వ్య‌క్తికి ఈ భ‌వంతిని అమ్మేశారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఈ బిల్డింగ్‌ను ఆర్బెజ్‌ త‌న తెలివితో హోట‌ల్‌గా మార్చేశాడు.

Honeymoon in Switzerland

తొలిరేయికి మ‌రిచిపోలేని మ‌ధురానుభూతి

రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఈ హోట‌ల్ ఇప్పుడు ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ హోట‌ల్‌లోని కిచెన్‌, డైనింగ్ రూం, హాల్ ఇంకా చాలా గ‌దులు రెండు దేశాల సరిహ‌ద్దుల కింద‌కు వ‌స్తాయి. ముఖ్యంగా ఈ హోట‌ల్‌లోని హనీమూన్ సూట్‌ గురించి చెప్పుకోవాలి. ఇందులోని బెడ్ మ‌ధ్య‌లో నుంచి స‌రిహ‌ద్దు వెళ్తుంది. అంటే స‌గం బెడ్ ఫ్రాన్స్‌లో ఉంటే.. ఇంకో స‌గం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటుంది. ఇదే విష‌యాన్ని సింబాలిక్‌గా చెప్పేందుకు బెడ్‌పై ఉండే రెండు దిండ్ల‌లో ఒకదానికి ఫ్రాన్స్‌, మ‌రొక దానికి స్విట్జ‌ర్లాండ్ జాతీయ ప‌తాకాల‌ను పోలిన బెడ్ క‌వ‌ర్ల‌ను తొడుగుతారు. అంటే.. కొత్త‌గా పెళ్ల‌యిన జంట ఈ హోట‌ల్‌లో హ‌నీమూన్‌కి వెళ్తే.. దంప‌తులిద్ద‌రిలో ఒక‌రు ఫ్రాన్స్‌లో.. మ‌రొక‌రు స్విట్జ‌ర్లాండ్‌లో ప‌డుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఇలాంటి వింతైన అనుభూతి ద‌క్కుతుండ‌టంతో ఈ హోట‌ల్‌లో హ‌నీమూన్ జ‌రుపుకునేందుకు కూడా చాలా జంట‌లు ఆస‌క్తి చూపిస్తున్నాయి.

ఈ హోట‌ల్‌లోని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌లు

  • ఈ హోట‌ల్‌లోని రెస్టారెంట్ స‌గం ఫ్రాన్స్‌లో ఉంటే.. మ‌రో స‌గం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటుంది.
  • బార్ మొత్తం ఫ్రాన్స్‌లో ఉంటే దాని ఎంట్ర‌న్స్ డోర్‌ మాత్రం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంది.
  • బిల్డింగ్‌లోని మెట్ల‌లో కింది స‌గం ఒక దేశంలో ఉంటే.. మిగిలిన స‌గం ఇంకో దేశం కింద‌కు వ‌స్తాయి.
  • ఒక రూం విష‌యానికొస్తే ఆ గ‌ది మొత్తం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటే.. దాని బాత్‌రూమ్ ఒక్క‌టి ఫ్రాన్స్‌లో ఉంటుంది.
  • ఈ హోట‌ల్ అడ్ర‌స్‌ను ఇరు దేశాలు త‌మ దేశంలో చూపించుకుంటాయి.
  • ఆదాయ‌పు పన్నును కూడా హోట‌ల్ మేనేజ్‌మెంట్ రెండు దేశాల‌కు స‌మానంగా చెల్లిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ర‌త‌న్ టాటా.. అప‌ర కుబేరులు చేసిన ఫ‌స్ట్ జాబ్ ఏంటో తెలుసా?

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

ప్రేమ కోసం రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను వ‌దిలేసిన యువ‌రాజులు, యువ‌రాణులు వీళ్లే..

బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో మ‌న గౌర‌మ్మ‌.. క్వీన్ విక్టోరియా ద‌త్తపుత్రిక గురించి తెలుసా?

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana