బాలీవుడ్ క్యూట్ డాల్ అలియా టాలీవుడ్‌కీ సుపరిచితురాలు. ఆమె వేసుకునే డ్రెస్‌లు కూడా జనాన్ని అంతే స్థాయిలో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అలియా కోసం డిజైన్ చేసే చుడీదార్లు అయితే అభిమానుల కండ్లని కట్టి పడేస్తుంటాయి. అలా జనానికి తెగ నచ్చిన ఓ డిజైనే అలియా కట్. వి నెక్ వచ్చి, నడుం పై భాగంలో ఎంబ్రాయిడరీ ఉండటం దీని ప్రత్యేకత.
వి నెక్… కాలర్ బోన్‌ను ప్రస్ఫుటంగా కనిపించేలా చేసి, వేసుకున్న వారిని నాజూగ్గా చూపుతుంది. ఇక, ఎంబ్రాయిడరీతో పాటు కింద వచ్చే కుచ్చులు ఆడపిల్లల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అలియా కట్లో ఉన్న ఆ మ్యాజిక్కే అమ్మాయిల్ని కట్టి పడేస్తున్నదన్న విషయం అర్థమైందిగా!