ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, అవినీతి ఆరోపణలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇందుకోసం బీఆర్ఎస్ చేపట్టే వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉన్నదని పేరొన్నారు.
పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యా యి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వారం రోజు ల కార్యాచరణకు ముందుగా సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చార్జిషీట్ వేస్తూ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత వరుసగా వారం పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం సెప్టెంబర్ 2న కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. కాంగ్రెస్ హామీల మోసాన్ని ప్రతీకాత్మకంగా ప్రజలకు తెలియజేసేందుకు భారీ ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ‘420 హామీలు’ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇదే సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఇంకా బాకీ ఉన్నా హామీలను తెలియజేసేలా ప్రత్యేక బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 3న రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు సదస్సులు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, యూరి యా, పంటల బీమా వంటి కీలక అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పా రు. హైదరాబాద్‌తో పాటు అర్బన్ ప్రాంతాల్లో 22ఏ భూముల సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
సెప్టెంబర్ 4న: మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం వంటి అంశాలతో పాటు ఇతర సంక్షేమ హామీల అమలు పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వినూత్నంగా వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సెప్టెంబర్ 5న: విద్యార్థులు, యువత సమస్యలపై ప్రత్యేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, ఉద్యోగాల కల్పనతో పాటు యువతకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువతతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అదిలాబాద్‌లో సీసీఐ సమస్యలు, సింగరేణి ప్రాంతాల్లో ఆయా వర్గాల సమస్యలపై ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
సెప్టెంబర్ 6న: హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించాలని కేటీఆర్ తెలిపారు. తాగునీరు, వీధిదీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానలు, డ్రైనేజీల నిర్వహణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అదే రోజు మిగిలిన నియోజకవర్గాల్లో పల్లెల పరిస్థితి, పడకేసిన పారిశుధ్య వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
సెప్టెంబర్ 7న: జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేసే వేదికగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. అన్ని జి ల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యం, ప్రజలకు జరిగిన మోసంపై వినతిపత్రాలు సమర్పించాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 8న: అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి, ఆయా జిల్లాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని తెలిపారు. సెప్టెంబర్ 10న జరుగనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించాలని సూచించారు.
పార్టీ చేపట్టనున్న వారం రోజుల కార్యాచరణను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు విసృ్తతంగా, ప్రజల భాగస్వామ్యంతో, సాధ్యమైనంత వినూత్నంగా నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలోని వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలు ఎదురొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని, పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వ యం చేస్తుందని తెలిపారు. ప్రతిదానిపై నివేదికలు తీసుకోవడంతోపాటు పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసి నేతలకు మా ర్గదర్శకాలు అందజేస్తామని చెప్పారు.
తెలంగాణ భవన్లో 1న సర్కార్‌పై చార్జ్‌షీట్
