బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
Bangkok Original Name | సింపుల్‌గా మనం బ్యాంకాక్ అని అనేస్తాం.. కానీ దాని అసలు పేరు చెప్పాలంటే మన నోరు కూడా తిరగదు..

Bangkok Original Name | బ్యాంకాక్.. ఈ పేరు వినగానే యువకుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తుంది. బీచ్‌లు, అందమైన అమ్మాయిలు, థాయ్ మసాజ్‌లు ఇవే మన కళ్లముందు మెదులుతాయి. ముద్దుగా.. సింపుల్‌గా మనం బ్యాంకాక్ అని అనేస్తాం.. కానీ దాని అసలు పేరు చెప్పాలంటే మన నోరు కూడా తిరగదు.. ఒకవేళ కష్టపడి అందామనుకున్నా మొత్తం పేరు చదివేసరికి ఆయాసం రావడం పక్కా. అంత పెద్ద పేరా ! అని అనుకుంటున్నారా.. అవునండీ బాబోయ్.. నిజంగానే చాలా పే….ద్ద పేరు.. ఆ పేరును మీరూ చదివేయండి మరి. “క్రుంగ్థెప్మహానాఖోన్ అమోన్రత్తనకొసిన్ మహింథరయుత్తయ మహాదిలోక్ఫోప్ నొప్పరాట్రచతానిబురిరోమ్ ఉదోమ్రచనివెట్మహాసతాన్ అమోన్పిమాన్అవతన్సాత్హిత్ సఖటతియావిట్సనకుమ్ప్రసిట్..”
.. ఇదేదో సంస్కృత శ్లోకంలా ఉందని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో దీనికి ఈ పేరు పెట్టారు. ఇంత పొడవైన పేరుకు ఓ అర్థం కూడా ఉంది. దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం. కింగ్ మాంగ్‌కుట్ మహారాజు బ్యాంకాక్‌కు పెట్టిన పేరు ఇది.
థాయిలాండ్ ( ఒకప్పటి సియా రాజ్యం)లోని బ్యాంకాక్ ఇప్పుడైతే నగరం కానీ.. పూర్వం అది ఒక పల్లెటూరు. చావో ఫ్రాయా నది తీరంలో ఉండేది. అయితే 15వ శతాబ్దంలోనే ఆయుత్తయ రాజులు దీన్ని నగరంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. 1782లో ఫుత్తయోత్ఫా చౌలలోక్ ( కింగ్ రామా I) ) బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో ఈ రాజధానిని క్రుంగ్‌థెప్ తవరవాడి సి ఆయుత్తయ, క్రుంగ్‌థెప్ మహానిఖోన్ సి ఆయుత్తయ అని పిలిచేవారు. అయితే 1833లో బ్యాంకాక్ పేరును సియా- యుతియాగా పిలవడం ప్రారంభించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ అదే పేరుతో ఈ నగరాన్ని పిలిచేవారు. ఇక 1850ల్లో కింగ్ మాంగ్‌కుట్ పైన చెప్పుకున్న పొడవైన పేరును పెట్టారు.
అత్యంత పొడవైన పేరు కలిగిన నగరంగా గిన్నిస్ బుక్‌లోనూ ఈ నగరం చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ నగరాన్ని అందరూ బ్యాంకాక్ అని పిలుస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం అదే పాత పేరుతోనే పిలుస్తున్నారు. అయితే మొత్తం పేరుతో కాకుండా.. కుదించి క్రుంగ్‌థెప్ మహానిఖోన్, క్రుంగ్‌థెప్ అని పిలుస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
Pet Passport : శునకాలకూ పాస్‌పోర్టు ఉంటుందని తెలుసా !
కూలి పనులు మాని యూట్యూబ్‌లో లక్షలు సంపాదిస్తున్నాడు..
పేదలకు అండగా.. ఒక్కడే 100 ఇండ్లు కట్టించి ఇచ్చాడు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

