ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా

diomede islands | ఆ రెండు ద్వీపాల మధ్య దూరం నాలుగు కిలోమీటర్లే.. కానీ ఒక ద్వీపం నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు బయల్దేరితే.. ఇంకో ద్వీపానికి వెళ్లేసరికి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలు దాటుతుంది. అదేంటి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లడానికి అంత సమయం ఎందుకు పడుతుంది? బోటులో వెళ్తే పది నిమిషాల్లో వెళ్లిపోతాం కదా అని అనుకుంటున్నారా? కానీ మీరు ఎలా వెళ్లినా ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్లేసరికి రోజు మారడం ఖాయం. అదెలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక తిరకాసు ఉంది.. అక్కడి టైమ్‌జోన్‌లో తేడానే ఇందుకు కారణం…

అమెరికా, రష్యా దేశాలను వేరు చేస్తూ బేరింగ్, చుక్చి సముద్రాల మధ్య ఈ రెండు ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలను 1728 ఆగస్టు 16న డెన్మార్క్‌కు చెందిన ఒక నావికుడు కనుగొన్నాడు. వాటికి గ్రీక్ దేవుడైన డయోమెడ్ పేరు పెట్టాడు. వీటిలో విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ద్వీపానికి బిగ్ డయోమెడ్ అని, విస్తీర్ణంలో చిన్నగా ఉన్న ద్వీపానికి లిటిల్ డయోమెడ్ అని నామకరణం చేశారు. వీటిలో బిగ్ డయోమెడ్ అమెరికాలోని అలస్కా కిందకు వస్తుంది. లిటిల్ డయోమెడ్ రష్యా కిందకు వస్తుంది. సాధారణంగా పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో సమయంలో వ్యత్యాసం పెద్దగా ఉండదు. కానీ ఈ డయోమెడ్ ద్వీపాలను ఇంటర్నేషనల్ డేట్లైన్ వేరు చేస్తుంది. దీంతో రెండు ద్వీపాల్లో వేర్వేరు టైమ్జోన్లను ఫాలో అవుతున్నారు. లిటిల్ డయోమెడ్‌లో AKDT ( Alaska Daylight Time ), బిగ్ డయోమెడ్‌లో ANAT ( Anadyr Time ) టైమ్‌జోన్ ఉంది. ఈ రెండు టైమ్జోన్ల మధ్య వ్యత్యాసం దాదాపు 21 గంటలుగా ఉంటుంది. అంటే.. బిగ్ డయోమెడ్‌లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్ డయోమెడ్‌లో తేదీ మారుతుంది. అందుకే బిగ్ డయోమెడ్‌ను టుమారో ఐలాండ్ అని, లిటిల్ డయోమెడ్‌ను ఎస్టర్ డే ఐలాండ్ అని పిలుస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

