Jeera Water Health Benefits | జీలకర్ర వంటకు సువాసనను ఇస్తుంది. రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికీ మేలుచేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు అనేక పోషకాలు ఉన్నాయి.
బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజూ ఉదయం పరగడుపునే అరగ్లాసు జీరా వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపడంలో సాయపడుతుంది. జీలకర్రలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలం. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
“బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు.. ఆవు పాలతో పోలిస్తే ఏవి ఎంత మేలు?”