బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు.. ఆవు పాలతో పోలిస్తే ఏవి ఎంత మేలు?
Milk | సోయా, బాదం, ఓట్స్, బియ్యం, కొబ్బరి, బఠానీ.. తదితర పదార్థాల నుంచి కూడా పాలు తయారు చేస్తున్నారు. మార్కెట్ కూడా బాగానే ఉంది. గతంతో పోలిస్తే నాన్ డెయిరీ ఉత్పత్తుల గిరాకీ 54 శాతం పెరిగిందని అంచనా. వివిధ ఆహార పదార్థాలను నానబెట్టి, బాగా రుబ్బి, వడగట్టి తీసే ద్రవాన్నే ‘పాలు’ అని పిలుస్తున్నారు. వాటిలోని పోషకవిలువల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
బాదం పాలు
అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇది. ఒక కప్పు బాదం పాలలో 37 కేలరీలు మాత్రమే ఉంటాయి. సాధారణ పాలతో పోలిస్తే ఇది పావువంతే. ప్రొటీన్ పరంగా చూస్తే.. కప్పు పాలలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటే, బాదం పాలలో ఒక గ్రాము మాత్రమే ఉంటుంది.
ఓట్స్ పాలు
ఒక కప్పు ఓట్స్ పాలలో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. సాధారణ పాలతో పోలిస్తే ఇది తక్కువే. ఫైబర్ పెంచుకోవాలనుకుంటే ఓట్స్ ధాన్యమే ఉత్తమం. ఓట్స్ పాలతో పోలిస్తే.. ఓట్స్
ధాన్యంలో రెండు రెట్లు ఫైబర్ లభిస్తుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, ఊబకాయం నియంత్రణలో ఓట్స్ ఫైబర్ సహకరిస్తుంది.
సోయా పాలు
అన్ని విధాలా ఆవుపాలకు సమానం. పోషకాల పరంగాను సరిసాటిగా నిలుస్తాయి. ఒక కప్పు సోయా పాలలో 6 గ్రాముల ప్రొటీన్, 105 కేలరీలు, 89 శాతం మంచి కొవ్వు ఉంటాయి. క్యాల్షియం, విటమిన్-ఎ, డి లభిస్తాయి.
కొబ్బరిపాలు
తురిమిన కొబ్బరి నుంచి తీసే ఈ పాలలో సహజంగానే తీపిశాతం ఎక్కువ. కప్పు కొబ్బరి పాలలో 0.5 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. అయితే, ఇది చెడు కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుందని అధ్యయనాలు నిరూపించాయి.
బఠానీ, బియ్యం పాలు
బఠానీ పాలలో ప్రొటీన్ అధికం (కప్పునకు 8 గ్రాములు). ఇక బ్రౌన్ రైస్ నుంచి తయారయ్యే పాలు సహజంగానే తీయగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువ.
అదే ఆవుపాలు అయితే..
ప్రొటీన్లు, క్యాల్షియం, పొటాషియం విటమిన్- బి, ఎ, డి సహజసిద్ధంగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి చాలా మంచివి. ఆవు పాలనుంచి మీగడ, వెన్న, పనీర్ వంటి ఉప ఉత్పత్తుల తయారీ చాలా సులభం. మొక్కల నుంచి తీసిన పాలతో ఆ వెసులుబాటు తక్కువే.
Read More :
“గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- almond
- Health
- Health benefits
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

