కొందరు బర్రెపాలు ఇష్టపడితే, మరికొందరు ఆవుపాలు కోరుకుంటారు. ఈ రెండూ నచ్చని వాళ్లకోసం ఇప్పటికే మార్కెట్లో రైస్ మిల్క్, సోయా మిల్క్ అంటూ రకరకాల పాలు దొరుకుతున్నాయి. వీటికితోడుగా ఆలుగడ్డ పాలు అందుబాటులోకి వచ్చాయి. 2022లో ఆలుగడ్డ పాలు కొత్త ట్రెండ్ సృష్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్వీడిష్ బ్రాండైన ‘డగ్’ ఇప్పటికే ఆలుగడ్డల నుంచి పాలు తయారుచేస్తున్నది. ఈ పాలు ఇప్పటికే స్వీడన్, చైనా, ఇంగ్లండ్‌లో అందుబాటులో ఉన్నాయి. మిల్క్ ప్రొటీన్ అలర్జీ ఉన్నవాళ్లకు ఈ పాలు బాగా నచ్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘చీజ్, బట్టర్, సోర్ క్రీమ్ వంటి కొవ్వులు కలపకుండా ఆలుగడ్డ తినడం ఎంతో ఆరోగ్యకరం’ అని చెబుతున్నారు సింగపూర్ పరిశోధకులు.ఆ ప్రయోజనాలు ఆలూ పాలలో పుష్కలం.