ఆవు, గేదె పాల బదులు ఈ పాలు వాడొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?
Soya Milk | సోయా పాలు సాధారణ ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చా? అవి ఆరోగ్యానికి మంచిదేనా? వాటిలో పోషకాలు ఉంటాయా?

Soya Milk :పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. మనం రోజూ తాగే ఆవు, గేదె పాలకు ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా సోయా పాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సోయా పాలు సాధారణ ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చా? అవి ఆరోగ్యానికి మంచిదేనా? వాటిలో పోషకాలు ఉంటాయా? ఇప్పుడు తెలుసుకుందాం..

సోయా పాలు అంటే ఏంటి?
శాకాహారులకు అత్యుత్తమమైన ప్రోటీన్ల ఖజానా సోయాబీన్స్. వీటి గింజల నుంచి తీసినవే సోయా పాలు. ఆవు పాలు లేదా గేదె పాలు పడని వారు, సాధారణ పాలను తాగేందుకు ఇష్టపడని వారు.. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సోయా పాలను తాగొచ్చని న్యూటిషియన్లు చెబుతున్నారు.

సోయాపాలల్లో కేలరీలు, ప్రోటీన్లు ఉంటాయా?
ఆవు, గేదె పాలతో పోలిస్తే సోయా పాలల్లో కేలరీలు తక్కువగానే ఉంటాయి. కాకపోతే సాధారణ పాలల్లో ఉన్నట్టే ప్రోటీన్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు సోయా పాలల్లో కొంచెం పిండి పదార్థాలు, పీచు పదార్థాలు అదనంగా లభిస్తాయి. విటమిన్ కె, థయామిన్, ఫోలెట్ వంటి విటమిన్లు, మాలిబ్డినమ్, కాపర్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. సోయా పాలల్లో ఎక్కువగా ఉండే ఐసోఫేవన్స్.. గుండెజబ్బులు, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైన వాటి నుంచి రక్షణనిస్తాయి.

ఎవరు తాగొచ్చు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
సోయా బీన్స్ అంటే అలర్జీ ఉన్న వారు తప్ప మిగిలిన వారందరూ ఈ సోయా పాలు తాగొచ్చు. అయితే మార్కెట్లలో లభిస్తున్న సోయా పాలల్లో రుచికోసం చక్కెర కలుపుతున్నారు. కాబట్టి చక్కెర కలపని సోయాపాలను ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
ఈ ఐదింటిని డైట్లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!
మధుమేహులకు శుభవార్త : పాక్‌లో చక్కెర లేని మామిడి పండ్లు
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

