e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

చాలామంది దృష్టిలో పొద్దున వండింది రాత్రికి, రాత్రి వండింది పొద్దుటికి ‘చద్దన్నం’ఖాతాలో చేరిపోతుంది.ఆ పదార్థమంటే చిన్నచూపు చూస్తారు. చెత్తబుట్టలో పడేస్తారు.కానీ, ఆ చద్దన్నమే. అనేక పోషకాలకు నిలయమని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళు సైతం చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి.

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

చ‌ద్ద‌న్నం అంటే మిగిలిపోయిన‌ అన్నం కాదు

ఏ ఇంట్లో అయినా, భోజనాలయ్యాక అంతో ఇంతో అన్నం మిగలడం పరిపాటే. మరునాడు దాన్ని ఏ పులిహోరగానో, ఫ్రైడ్‌ రైస్‌గానో ఆరగించడం తెలిసిందే. కానీ, చద్దన్నం అంటే అలా మిగిలిపోయిన అన్నాన్ని ఎలాగోలా ఆరగించడం కాదు. దానికంటూ ఓ ప్రక్రియ ఉంది. అప్పట్లో, మిగిలిన అన్నాన్ని ఓ కుండలో వేసి.. కొన్ని నీళ్ళు, గంజి, దబ్బ/నిమ్మ ఆకు వేసి ఒకటినుంచి మూడు రోజులు పులియబెట్టేవారు. ఆ మరునాడు ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త పెరుగులేదా మజ్జిగ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చీ నంజుకుంటూ తినేవాళ్ళు. అదే అసలైన చద్దన్నం! ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు. దీన్నే సైన్స్‌ పరిభాషలో ‘ఫర్మెంటెడ్‌ లేదా ప్రోబయోటిక్‌ రైస్‌’ అంటున్నారు.

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

చ‌ద్ద‌న్నం దినోత్స‌వం కూడా ఉంది

- Advertisement -

రెండు మూడు రోజులు పులియబెట్టకున్నా, రాత్రి మిగిలిన అన్నంలో ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకుని తినేవారూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మిగిలిన అన్నంలో పాలు, పెరుగు పోసితోడుపెట్టి ఉదయాన్నే తింటారు. మొత్తంమీద మిగిలిన అన్నాన్ని నీళ్ళలోనో, గంజిలోనో పులియబెట్టి తినడం అన్నది దేశవ్యాప్తంగా ఉంది. చద్దన్నాన్ని అసోంలో పొయిటా బాత్‌, బిహార్‌లో జీల్‌ బాత్‌, తమిళనాడులో పళయ సాదమ్‌ అనీ, ఒడిషా, బెంగాల్‌లలో పఖాలా బాత్‌ అనీ పిలుస్తారు. ఒడిషాలో ఏటా మార్చిలో చద్దన్నం దినోత్సవాన్ని కూడా జరుపుకొంటారు. ఆ రోజున చద్దన్నమే ప్రత్యేక వంటకం. రాత్రంతా నీళ్ళలో పులిసిన అన్నానికి కాస్త పెరుగు, ఆవ నూనె, జీలకర్ర, ఉల్లిపాయ, పుదీనా జోడించి సంవత్సరాదిన తినడం బెంగాలీల సంప్రదాయం. విందు భోజనాల్లో అయితే చేపలు, ఆలూబజ్జీ, పప్పుతోపాటు వడ్డిస్తారు. పులిసిన అన్నాన్ని తింటే పులిలా ఉంటారని ఈశాన్య భారతీయుల నమ్మకం. చద్దన్నం గొప్పతనాన్ని తెలుసుకున్న విదేశీయులు సైతం ఈ సూత్రాన్నిఆచరిస్తున్నారు.

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

పోష‌కాలెన్నో..

అమెరికన్‌ న్యూట్రిషన్‌ అసోసియేషన్‌ చద్దన్నంలోని పోషక విలువలను నిర్ధారించింది. దీంతో, మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చిందీ తరాలనాటి వంటకం. ఆధునిక షెఫ్‌లు అయితే పెరుగు, కొబ్బరితురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ వంటివాటిని జోడించి చద్దన్నానికి మేకోవర్‌ ఇస్తున్నారు. చద్దన్నం అనేది జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాలను హరించి, మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. ఆయుర్వేదంలోనూ దీనిప్రస్తావన ఉంది. అందుకే పూర్వం నుంచీ చద్దన్నం మన ఆహారంలో భాగమైంది. పులిసే ప్రక్రియలో బ్యాక్టీరియా చద్దన్నంలోని పోషకాలతో చర్యలు జరుపుతుంది. దీంతో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం రెట్టింపు అవుతాయి. కాబట్టే, అప్పుడప్పుడూ చద్దన్నాన్నీరుచి చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ ఐదింటిని డైట్‌లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!

మధుమేహులకు శుభవార్త : పాక్‌లో చక్కెర లేని మామిడి పండ్లు

షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా

స్నానానికి ఏ నీళ్లు మంచివి?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

ట్రెండింగ్‌

Advertisement