Home
Telangana
The Bc Welfare Association And Others Demanded That Minister Ponguleti Srinivas Reddy Apologize
పొంగులేటీ.. శ్రీహరికి క్షమాపణ చెప్పు
బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు డిమాండ్ చేశారు.
- బీసీ మంత్రిని అవమానించడం సరికాదు: బీసీ సంక్షేమ సంఘం
రవీంద్రభారతి, మే 27: బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మంత్రి శ్రీహరిపై సహచర మంత్రి అయిన పొంగులేటి పేపర్లు విసిరి అవమానించేలా దుర్బాషలాడారని ఆరోపించారు.
శ్రీహరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద బుధవారం మంత్రి పొంగులేటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నీల వెంకటేశ్ మాట్లాడారు. క్షమాపణ చెప్పకుంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని ముట్టడించి బీసీల ద్రోహిగా ప్రకటిస్తామని హెచ్చరించారు. బీసీ మంత్రిని అవమానించడం సరికాదని, బీసీ మంత్రుల జోలికొస్తే బీసీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

