Indiramma Illu | కేటీఆర్ సవాలుతో ఉలిక్కిపడ్డ సర్కార్.. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని ఒప్పుకున్న పొంగులేటి!
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
Indiramma Illu | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగమేఘాల మీద బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. దీంతో రెండున్నరేండ్లయినా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఒప్పుకున్నట్టయింది.
సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నిర్మించిన ఇండ్ల కంటే వచ్చే రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మించకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

