Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Milk | వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజూ పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలంటేనే పోషకాల గని. విటమిన్-డి, క్యాల్షియం వీటిలో పుష్కలం. ఈ నేపథ్యంలో.. ఆవుపాలు, బర్రెపాలలో ఏవి ఎక్కువ ఆరోగ్యకరమన్న చర్చ జరుగుతున్నది.

కొవ్వు శాతం
పాలలోని కొవ్వుపైనే చిక్కదనం ఆధారపడి ఉంటుంది. ఆవుపాలలో మూడు నుంచి నాలుగు శాతం కొవ్వు ఉంటుంది. అదే బర్రెపాలలో ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది. అందుకే బర్రెపాలు చిక్కగా ఉంటాయి. అయితే, బర్రెపాలు తొందరగా జీర్ణం కావు. ఆవుపాల కంటే బర్రెపాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఊబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధ వ్యాధులున్నవారు బర్రెపాలు తాగడం మంచిదని అంటారు.
ప్రొటీన్లు
ఆవుపాల కంటే బర్రెపాలలో 10 నుంచి 11 శాతం ప్రొటీన్లు ఎక్కువ. ఆవుపాలలో క్యాలరీలు తక్కువే. ఒక గ్లాసు ఆవుపాలలో 148 క్యాలరీలు ఉంటే, అంతే పరిమాణంలోని బర్రె పాలలో 237 క్యాలరీలు లభిస్తాయి. బర్రెపాలలోని పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల ఆవుపాలతో పోలిస్తే బర్రెపాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

రంగులో తేడా..
బర్రెపాలు తెల్లగా ఉంటాయి. ఆవుపాలు పసుపు, తెలుపు రంగులు కలగలసి ఉంటాయి. బర్రెపాలలోని బీటా కెరోటిన్ రంగులేని విటమిన్-ఎ గా మారుతుంది. అందుకే బర్రెపాలలో పసుపు రంగు పోతుంది. ఆవుపాలలో బీటా కెరోటిన్ ఉన్నా, మోతాదు తక్కువే.
ఎన్నో ఉపయోగాలు
నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ముందు ఒక గ్లాసు బర్రెపాలు తాగడం మంచిది. కోవా, పెరుగు, నెయ్యి, పనీర్, పాయసాలకు బర్రెపాలు ఉత్తమం. పాల ద్వారా క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్-డి వంటి పోషకాలు అందుతాయి. పాలలోని క్యాల్షియం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఎముకల హీనత, క్యాన్సర్, తలనొప్పి, ఊబకాయం తదితర సమస్యలు అధిగమించడానికి నిత్యం పాలు తాగాల్సిందే. పాల వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతారు వైద్య నిపుణులు.
✍ మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పిల్లలకు ఎలాంటి పాలు శ్రేయస్కరం..? పల్చని పాలు తాగించొచ్చా?
Milk | మీరు తాగే పాలు కల్తీ అయ్యాయని అనుమానమా ! ఈ చిట్కాతో తెలుసుకోండి
World Breastfeeding Week | తల్లి పాలకు, ఇతర పాలకు తేడా ఏంటి.. పరిశోధనల్లో ఏం తేలింది ?
ఆవు, గేదె పాల బదులు ఈ పాలు వాడొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

