World Breastfeeding Week | తల్లి పాలకు, ఇతర పాలకు తేడా ఏంటి.. పరిశోధనల్లో ఏం తేలింది ?
World Breastfeeding Week | తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.

World Breastfeeding Week | తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వయసు వరకు, అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని వైద్యులు సూచిస్తారు. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందుతుంది. కానీ.. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్, శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా, పౌడర్ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు.

ముర్రుపాలతో ప్రయోజనాలు..
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో మొదటగా ఊరేవి ముర్రుపాలు. వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలి. వీటిలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలి. పాలిచ్చే తల్లి అధికంగా నీరు తీసుకోవాలి. ఫలితంగా పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిమ్మజాతి పండ్లు, డ్రైప్రూట్స్, బీన్స్ అధికంగా తీసుకోవాలి.

పరిశోధనల్లో తేలిన విషయాలు
తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు శ్వాస సంబంధిత వ్యాధులు, చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అస్తమా, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు(యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) రాకుండా కాపాడవచ్చు. చిన్నపేగు, పెద్ద పేగుల సంబంధిత వ్యాధులు (గ్యాస్ట్రో నింటెస్టినల్ రిఫ్లెక్స్) రాకుండా నివారించవచ్చు. మెదడుపై పొరల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు(బ్యాక్టీరియల్ మెనింగిటిస్) రాకుండా కాపాడగలుగుతాం. కీళ్ల సంబంధిత వ్యాధులు(జువైనెల్ ర్యూమొటైడ్ ఆర్థరైటిస్), తెల్లరక్త కణాల సంబంధిత వ్యాధులు(చైల్డ్‌హుడ్ లింపోమస్) రాకుండా కాపాడవచ్చు. తల్లిపాలు తాగిన వారికి డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు(మల్టీపుల్ స్కెలోరిసిస్) తలెత్తే అవకాశం తక్కువ. ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

తల్లిపాలకు, ఇతర పాలకు తేడా..
ఆవు పాలలో కేసిన్ అనే ప్రొటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ ప్రొటీన్ కడుపులోకి వెళ్లాక ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీంతో ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది. అదే తల్లిపాలలో ఈ ప్రొటీన్ తగినంత పరిమాణంలో ఉండడం వల్ల శిశువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం జీర్ణమవుతుంది. తల్లిపాలలో లాక్టోజ్ పరిమాణం(ఎల్/7జీ) ఉండగా ఆవు పాలలో (ఎల్/48జీ)గా ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరులో అత్యంత కీలకపాత్ర పోషించే లాక్టోజ్ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల తల్లిపాలు తాగే శిశువులు చురుగ్గా ఉంటారు. తల్లిపాలలో ఉండే లినోయిన్ ఆమ్లం శిశువు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. తల్లి పాలలో ఐరన్ 50 శాతం ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఏ రకంగా చూసినా బిడ్డకు తల్లిపాలు పట్టడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం.

డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో..
తల్లిపాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మన దేశంలో బీపీఎన్ఐ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

తల్లి పాటించాల్సిన పద్ధతులు
- చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే బిడ్డకు పాలివ్వాలి.
- వంగి పాలివ్వకూడదు
- పాలిచ్చిన ప్రతిసారి రెండు వైపులా పట్టించాలి.
- పాలు తాగిన తర్వాత కొద్ది సేపటికి భుజాన వేసుకుని, తేరుకునే వరకు అదే స్థితిలో పడుకోబెట్టాలి.
- బిడ్డ పాలు తాగడం పూర్తయిన తర్వాత పెదాలను శుభ్రపరచాలి.
- మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలే బిడ్డకు ప్రధానంగా ఉండాలి. నాలుగు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో మెత్తని ఆహారాన్ని బిడ్డకు అందించాలి. తరుచుగా, బరువు స్థిరంగా పెరగడం, హాయిగానిద్రపోవడం, మూత్రం పోయడం వంటి లక్షణాల వల్ల బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవచ్చు.
- బిడ్డకు మొదటి సంవత్సరం తల్లి ఇచ్చే పాలు శక్తిని ఇచ్చేవి మాత్రమే కాకుండా చిన్నతనంలో రోగనిరోధక శక్తి పెంపునకు పునాది అవుతాయి.

డబ్బాపాలతో ఇన్ఫెక్షన్
తల్లిపాలు తాగని నవజాత శిశువులకు డయేరియా వ్యాధి సోకుతుంది. బాటిల్ ఫీడింగ్ వల్ల కంటా మినేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఆవు పాలు ఇవ్వడం వల్ల అరుగుదల శక్తి తగ్గుతుంది. దీంతో మెదడు అభివృద్ధి చెందదు. కానీ.. పిల్లలు అత్యధిక బరువు పెరిగే అవకాశం ఉంది.
డాక్టర్ హేమలతారెడ్డి, చిన్ని పిల్లల వైద్యనిపుణురాలు (ఇన్చార్జి హెచ్‌వోడీ రిమ్స్)

టీకా కంటే గొప్పది..
తల్లిపాలు టీకా కంటే బాగా పనిచేస్తాయి. ప్రతి తల్లీ సమృద్ధిగా బిడ్డకు పాలు పట్టించాలి. బిడ్డకు వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తా యి. చాలా పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తేనె, గ్లూకోజు వంటివి ఇవ్వొద్దు.
డాక్టర్ సాధన, గైనకాలజిస్టు, డిప్యూటీ డీఎంహెచ్‌వో
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

