e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home ఆరోగ్యం Healthy food | త‌ర‌చూ ఈ స్వీట్ తింటే అస్త‌మా, ఎసిడిటీ దూరం కావాల్సిందే

Healthy food | త‌ర‌చూ ఈ స్వీట్ తింటే అస్త‌మా, ఎసిడిటీ దూరం కావాల్సిందే

Healthy food |అందరూ ఇష్టంగా తినే చిరుతిండి.. పట్టీ లేదా చిక్కీ. పల్లీలు, నువ్వులు, పుట్నాలు, డ్రై ఫ్రూట్స్‌.. బెల్లం పాకంతో జోడించి చేసే చిక్కీలు పోషకాల గనులు. మహిళలకు ఇవి మరింత మేలు చేస్తాయంటారు పోషకాహార నిపుణులు. చక్కని పలారం ‘చిక్కీ’ గురించి..

చిక్కీల తయారీలో తీపికోసం చక్కెరకు బదులు బెల్లం వాడటం వల్ల మధుమేహంతో బాధపడేవారు కూడా తినవచ్చు. బెల్లంలోని పోషకాలు చాలా రుగ్మతలను నివారిస్తాయి. ఎసిడిటీ వంటి జీర్ణకోశ సమస్యల పరిష్కారానికి బెల్లం మంచి ఔషధం. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బెల్లం, నువ్వులు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు, బెల్లంలో కేలరీలూ తక్కువే.

- Advertisement -

ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాల్లో సంక్రాంతి పిండివంటల్లో నువ్వుల చిక్కీలు కచ్చితంగా ఉంటాయి. పండగ సందర్భంగా వీటిని బంధుమిత్రులతో పంచుకొని తినడం సంప్రదాయం. నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. శీతల ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి బాగాపనికొస్తాయి.

కరకరలాడే కమ్మని చిక్కీలంటే ఇష్టపడనివారు ఉండరు. పల్లీలు, నువ్వులే కాకుండా పుట్నాలు, మరమరాలతోనూ చిక్కీలు చేస్తారు. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌తో కూడా చేసుకుంటారు. బూందీ చిక్కీలూ బాగుంటాయి. పప్పుల చిక్కీలకంటే కూడా కరకరలాడుతాయి. వీటిని ‘కరకజ్జం’ అని పిలుస్తారు.

బడ్డీకొట్టు నుంచి సూపర్‌ మార్కెట్‌ వరకు.. చిరుతిళ్ళ గ్యాలరీలో తప్పక కనిపించే చిరుతిండి చిక్కీ. కొన్ని ప్రాంతాల్లో వీటిని ‘పట్టీలు’ అనీ అంటారు. వేరుశనగలు లేదా నువ్వులు బాగా వేయించి, బెల్లం పాకం పట్టి, పట్టీలు లేదా లడ్డూలు చేసే పద్ధతి తెలంగాణ పల్లెల్లో ఎప్పటి నుంచో ఉంది. అందులోనూ ఈ రెండూ ప్రధాన పంటలిక్కడ.

పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లతోపాటు కొవ్వుశాతం ఎక్కువ. వీటిని బెల్లంతో జోడించి తిన్నప్పుడు ఆయా పదార్థాలు అందించే పోషకాలు రెట్టింపు అవుతాయి. శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. శరీర దృఢత్వంకోసం వ్యాయామం చేసేవారికి ఇవి చక్కని ఉపాహారం.

చిక్కీలను సులభంగా చేసుకోవచ్చు. ముందుగా గింజలను నూనె లేకుండా దోరగా వేయించాలి. పల్లీలైతే పొట్టు నలుపుకోవాలి. గింజల కొలతకు సగం బెల్లం తీసుకుని తీగపాకం పట్టుకోవాలి. అందులో, వేయించుకొన్న గింజలు వేసి వెంటనే నూనె రాసిన పళ్ళెంలో పరుచుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ముక్కలు చేసుకుంటే టేస్టీ టేస్టీ చిక్కీలు సిద్ధం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

ఈ ఐదింటిని డైట్‌లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!

మధుమేహులకు శుభవార్త : పాక్‌లో చక్కెర లేని మామిడి పండ్లు

షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా

స్నానానికి ఏ నీళ్లు మంచివి?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana