LSG vs RR : భారీ ఛేదనలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Roylas) తడబడుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(34)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. లక్నో పేసర్ల ధాటికి మూడు బంతుల వ్యవధిలోనే ఇద్దరూ ఔటయ్యారు.
తొలుత యశ్ ఠాకూర్ యార్కర్‌తో బట్లర్‌ను బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత స్టోయినిస్ ఊరించే బంతితో యశస్వీని వెనక్కి పంపాడు. దాంతో, రాజస్థాన్ 60 పరుగులకు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ సంజూ శాంసన్(3), ఇంప్యాక్ట్ ప్లేయర్ రియాన్ పరాగ్(3)లు ఆడుతున్నారు. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్… 70/2.
YORKED ⚡️
Yash Thakur strikes at the stroke of Powerplay 👍
#RR 60/1Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvRR | @LucknowIPL pic.twitter.com/9mkxx560SB
— IndianPremierLeague (@IPL) April 27, 2024
సొంత గడ్డపై తొలుత ఆడిన లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) భారీ స్కోర్ చేసింది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50)లు అర్ద శతకాలతో చెలరేగారు. చివర్లో ఆయుష్ బదొని(18), కృనాల్ పాండ్యా(15)లు పోరాడడంతో 5 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. రాజస్థాన్ పేసర్లలో సందీప్ శర్మ(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు.
Innings Break!#LSG set a 🎯 of 1️⃣9️⃣7️⃣ of with crunch fifties from KL Rahul & Deepak Hooda 🙌
Which team will continue their winning run? 🤔
Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR pic.twitter.com/4dvv5yD64g
— IndianPremierLeague (@IPL) April 27, 2024