Karepalli : భూమి పట్టాదార్ పాసు పుస్తకం కలిగిన రైతులు తప్పసరిగా ‘రైతు గుర్తింపు కార్డు’ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బీ.అశోక్‌కుమార్(AO Ashok Kumar) తెలిపారు. అన్లైన్ దరఖాస్తుకు ఆదివారం (జనవరి 11) తుది గడువు అని ఆయన వెల్లడించారు.
పట్టాదార్ పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మీ సేవ సెంటర్‌కు వెళ్ళి రైతు నమోదు పక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు ఏఓ సూచించారు. పీఎం కిసాన్ నగదు పైకం జమ కావడానికి, ఇతర ప్రభుత్వ పథకాల వర్తింపు కోసం రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఆయన చెప్పారు.