చిన్నస్వామికి గ్రీన్ సిగ్నల్.. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు తొలిగిన అడ్డంకులు
ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
బెంగళూరు : ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిరుడు ఆర్సీబీ టైటిల్ గెలిచాక నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామిలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగింది.
అయితే ఇక్కడ మ్యాచ్‌లను నిర్వహించేందుకు గాను ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ.. స్టేడియంలో కేఎస్‌సీఏ, ఆర్సీబీ తీసుకుంటున్న క్రౌడ్ మేనేజ్మెంట్, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈనెల 28న మొదలుకానున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ (ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ)తో పాటు బెంగళూరు జట్టు మరో నాలుగు హోంమ్యాచ్లను ఇక్కడే ఆడుతుంది. దీంతోపాటు ఒక ప్లేఆఫ్, ఫైనల్ కూడా బెంగళూరులోనే నిర్వహించే అవకాశాలున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

