ఖమ్మం రూరల్/ బోనకల్లు/ చింతకాని, మార్చి 16: ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఖమ్మంజిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఎదుట ధర్నాలు చేపట్టి సమస్యలతో కూడిన వినతిపత్రాలను పీహెచ్సీ వైద్యులకు అందజేశారు. ఖమ్మంరూరల్ మండల పరిధిలోని యంవీ పాలెం పీహెచ్సీ ఎదుట జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమళ్లపల్లి మోహన్‌రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అదనపు పనికి అదనపు పారితోషికం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీ మల్లేశ్వరి, బీ జ్యోతి, సుభద్ర, భాగ్యమ్మ, కృష్ణవేణి, సూరమ్మ, అరుణ, సావిత్రి, తిరుపతమ్మ, మమత, నాగమణి, జ్యోతి, మంజుల పాల్గొన్నారు. బోనకల్లు పీహెచ్సీ వద్ద జరిగిన ధర్నాలో సీఐటీయూ నాయకుడు గుగులోత్ నరేశ్, ఆశా కార్యకర్తల యూనియన్ డివిజన్ కార్యదర్శి రమణ, సరోజిని మాట్లాడుతూ పీఆర్సీ ఏరియర్స్, పల్స్‌పోలియో, ఎలక్షన్ డ్యూటీలకు సంబంధించిన డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే తమ సమస్యలన్నింటినీ చర్చించి పరిషరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మరీదు లీలాకుమారి, నాగన్న, బోయిన రమాదేవి, ఉషారాణి, విజయలక్ష్మి, దుర్గా, తులసి, యశోద, వెంకటరమణ, విజయ్‌కుమారి పాల్గొన్నారు. చింతకాని పీహెచ్సీ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆశా కార్యకర్తల యూనియన్ చింతకాని మండల కన్వీనర్ గడ్డం రమణారావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్‌కు వినతిపత్రం అందజేశారు. కొప్పుల కమల, దేవమ్మ, పి.రాంబాయి, బి.మహాలక్ష్మి, నిర్మల, ఉష, సుజాత తదితరులు పాల్గొన్నారు.