Akhil | జైనబ్‌పై ట్రోలింగ్‌కు అఖిల్ ఫుల్ స్టాప్.. వయసు, మతం కాదు అవే మా బంధానికి బలం
Akhil | అక్కినేని హీరో అఖిల్ అక్కినేని తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ట్రోలింగ్‌కు తొలిసారి ఘాటుగా స్పందించారు. గతేడాది తన ప్రేయసి జైనబ్‌ని వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమె వయసు, మతంపై వచ్చిన విమర్శలను తాము ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమ బంధానికి అసలైన బలమని చెప్పారు. '
Akhil | అక్కినేని హీరో అఖిల్ అక్కినేని తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ట్రోలింగ్‌కు తొలిసారి ఘాటుగా స్పందించారు. గతేడాది తన ప్రేయసి జైనబ్‌ని వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమె వయసు, మతంపై వచ్చిన విమర్శలను తాము ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమ బంధానికి అసలైన బలమని చెప్పారు. ‘లెనిన్’ సినిమాతో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న అఖిల్, ఓ తాజా పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివ్ కామెంట్స్ గురించి అడగగా.. అలాంటి విషయాలకు తాము అసలు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు.
కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ గురించి ఆలోచించాలా? లేక జీవితాంతం నాతో ఉండే వ్యక్తితో సంతోషంగా జీవించడం గురించి ఆలోచించాలా? నాకు రెండోది ముఖ్యమైంది. అందుకే ట్రోలింగ్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు” అని అఖిల్ అన్నారు.పెళ్లికి ముందే తమ జీవితంలో ఇలాంటి విమర్శలు వస్తాయని జైనబ్‌కు చెప్పినట్లు అఖిల్ వెల్లడించారు.నేను నటుడిని. నా జీవితంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు తప్పవు. అందుకు సిద్ధంగా ఉండాలని నేను ముందుగానే చెప్పాను. ఆమె కూడా చాలా పరిణతితో అర్థం చేసుకుంది. వయసు, మతం గురించి వచ్చిన కామెంట్లను ఎంతో పాజిటివ్‌గా తీసుకుంది. అదే నాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది అని తెలిపారు.
తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన సమయంలో జైనబ్ తనకు అండగా నిలిచిందని అఖిల్ భావోద్వేగంగా చెప్పారు.మేము చాలా సంవత్సరాలుగా కలిసి ప్రయాణిస్తున్నాం. నా జీవితంలో కష్టమైన రోజుల్లో ఆమె నా పక్కనే ఉంది. నాకు కావాల్సిన ధైర్యం, ప్రేమ, మద్దతు ఇచ్చింది. అలాంటి వ్యక్తి నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టం అని అన్నారు.సోషల్ మీడియాలో వచ్చే విమర్శల నుంచి పూర్తిగా రక్షించడం ఎవరికీ సాధ్యం కాదని, కానీ వాటిని ఎలా స్వీకరించాలో జైనబ్‌కు బాగా తెలుసని అఖిల్ చెప్పారు.ఒక భర్తగా నేను తనకు అండగా ఉంటాను. కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌ను ఆపలేను. వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ఆమె పరిణతిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఆమె ఎంతో మెచ్యూరిటీ చూపించింది. అందుకే మేము ట్రోలింగ్‌ను కూడా ఒక ఆశీర్వాదంగానే తీసుకున్నాం అని పేర్కొన్నారు. ప్రేమలో కులం, మతం, వయసు కంటే పరస్పర అవగాహన, నమ్మకం ముఖ్యమని అఖిల్ అభిప్రాయపడ్డారు. పెళ్లికి ముందు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని యువతకు సూచించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- Chiranjeevi
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

