మిర్యాలగూడ జూలై 27: తనకు అన్ని అర్హతలు ఉన్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మిర్యాలగూడ పట్టణానికి చెందిన యూనస్ అనే వ్యక్తి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. పట్టణంలోని చైతన్య నగర్ కాలనీకి చెందిన యూనస్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయకపోతే కిందకు దూకి చనిపోతాను అంటూ పేర్కొంటున్నాడు. తాను చనిపోయాక తన భార్యకు అయిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ సోమ నరసయ్య యూసన్కు నచ్చజెప్పి కిందికి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.